తిరుపతి సహా మరో విమానాశ్రయం ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం

రిపోర్టర్: సతీష్ స్థలం: తిరుపతి

తిరుపతితో పాటు తిరుచిరాపల్లి విమానాశ్రయాలను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ మరియు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని బండ్లింగ్ విధానంలో ఈ రెండు విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నట్లు వారు వెల్లడించారు. దీనిద్వారా మౌలిక సదుపాయాలు మెరుగవడంతో పాటు కొత్త పెట్టుబడులు రానుండగా, రాజమహేంద్రవరం మరియు కడప విమానాశ్రయాలను కూడా ప్రైవేటు పరం చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.