రూపాయిల వ్యాపారం: డెబ్బై వేల పెట్టుబడితో నెలకు యాభై వేల సంపాదన
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
ఇంట్లో పనిచేసే వంట మనిషి కుమారుడు మొబైల్ స్క్రీన్ గార్డుల తయారీతో నెలకు యాభై వేల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు ప్రథమ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో వెల్లడించారు. కేవలం వేల రూపాయల పెట్టుబడితో యంత్రం కొనుగోలు చేసి స్థానిక దుకాణాలకు గార్డులు సరఫరా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్కో గార్డు తయారీకి పది రూపాయల ఖర్చవుతుండగా, ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలకు విక్రయిస్తున్నట్లు ఆయన వివరించారు.