ఏపీలో సోషల్ మీడియా అణచివేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలనపై పెరుగుతున్న ఆంక్షలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తొలుత ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా ఖాతాలు, ఆ తర్వాత వైసీపీ అధికారిక అకౌంట్లు, జర్నలిస్టుల పోస్టులను బ్లాక్ చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కేలా ఆన్‌లైన్ సెన్సార్‌షిప్ అమలు చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య హక్కుల హరణమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.