తపాల్పూర్ గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్పూర్ గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు అట్టహాసంగా సాగాయి. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న గణనాథులను బుధవారం సాయంత్రం బాజాభజంత్రీలు, మహిళల నృత్యాల నడుమ వైభవంగా ఊరేగింపు నిర్వహించి సమీప వాగులో నిమజ్జనం చేశారు.