పోలీస్ ఉద్యోగాల పోస్టులను పెంచాలని మంత్రి నారా లోకేష్‌కు వినతి

రిపోర్టర్: గోపి స్థలం: కాకినాడ

కాకినాడ రూరల్‌లో పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచాలని వినతిపత్రం సమర్పించారు. యువగళం పాదయాత్ర హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ద్వారా పోస్టులు భర్తీ చేస్తున్నామని, నిరుద్యోగులకు బంగారు భవిష్యత్ అందించడమే తమ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని చర్చిస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.