వైఎస్సార్సీపీ నేతలపై రౌడీషీట్లు తెరవాలని సీపీ ఆదేశం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: విజయవాడ
విజయవాడలో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటనతో పాటు గతంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ జాబితాలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్‌తో సహా పలువురు ముఖ్య నాయకుల పేర్లు ఉండటంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.