పంజాబీ గాయకుడు గులాబ్ సిద్దు నివాసంలో కాల్పుల కలకలం

రిపోర్టర్: కిరణ్ స్థలం: పంజాబ్

పంజాబ్‌లోని బర్నాలా జిల్లాలో ప్రసిద్ధ గాయకుడు గులాబ్ సిద్దు ఇంటిపై ముఖానికి ముసుగులు ధరించిన దుండగులు కాల్పులు జరిపారు. ఫర్వాహి గ్రామంలోని ఆయన నివాస గైటుపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా వెల్లడైంది. సంఘటన సమయంలో సిద్దు విదేశాల్లో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.