శత్రువులకు వెన్నులో వణుకు పుట్టించేలా మోదీ రక్షణ విధానం: అమిత్ షా
రిపోర్టర్: రాము
స్థలం: మహారాష్ట్ర
భారత్‌పై దాడి చేయాలంటే శత్రువులు వెన్నులో వణుకు పుట్టేలా ప్రధాని మోదీ బలమైన రక్షణ విధానాన్ని రూపొందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఉగ్రవాద దాడులు జరిగితే చూస్తూ ఊరుకునే పరిస్థితి నుంచి, శత్రువుల భూభాగంలోకి చొరబడి మరీ సమాధానం చెప్పే స్థాయికి భారత్ చేరుకుందని ప్రశంసించారు. 2047 నాటికి దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.