ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్ డిమాండ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. స్పీకర్ తీర్పు తప్పు అని తేలిందని, మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలని, దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని కేటీఆర్ తీవ్రంగా సవాల్ విసిరారు.