పుర ఎన్నికల పోరు షురూ: బొబ్బిలి బరిలో ముమ్మరంగా అభ్యర్థుల ప్రచారం
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయనగరం
పురపాలక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బొబ్బిలి పుర ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి పురపాలిక, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో నవంబరు 1న పోలింగ్ జరగనుంది. మేయర్ అభ్యర్థులుగా ఏడుగురు, ఛైర్మన్ల బరిలో ఎనిమిది మంది నిలిచారు. డివిజన్, వార్డు స్థానాల కోసం ఏకంగా 315 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెలుగు దేశం, జనసేన, భాజపాతో పాటు పలు పార్టీల నేతలు ముమ్మరంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు.