పంజాబ్ లో హాకీ ప్రపంచ కప్: నిర్వహణకు సిద్ధమన్న సీఎం భగవంత్ మాన్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: చండీగఢ్
పంజాబ్ రాష్ట్రం రెండు వేల ముప్పైలో జరగనున్న ప్రతిష్టాత్మక హాకీ ప్రపంచ కప్ నిర్వహణకు పూర్తిగా సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. మొహాలిలో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ముగింపు వేడుకల్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని, కొత్తగా ఆస్ట్రోటెర్ఫ్ మైదానాలను నిర్మించడంతో పాటు క్రీడల కోసం భారీగా నిధులు కేటాయించినట్లు సీఎం వెల్లడించారు.