యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు ఒక్కరోజే వచ్చిపడ్డ రూ 12 లక్షల ఆదాయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం రూ.12,55,603 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. వివిధ విభాగాల ద్వారా భక్తులు సమర్పించిన కానుకల వివరాలను అధికారులకు అందజేశారు. ప్రసాద విక్రయాలు, దర్శనాలు, వాహన పార్కింగ్ తదితర మార్గాల ద్వారా ఈ మొత్తం భక్తుల నుంచి వచ్చిందని ఈవో స్పష్టం చేశారు.