మార్చి నాటికి అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: సీఎం చంద్రబాబు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
కోనసీమ జిల్లా మాచవరంలో నిర్వహించిన మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించి, 56 లక్షల మందికి కొత్త పాస్ పుస్తకాలు అందిస్తామని స్పష్టం చేశారు. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి ప్రజల భూములకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.