హాలీవుడ్ లో తీవ్ర కలకలం: ప్రముఖ దర్శకుడు మైకెల్ మాన్ కి గాయాలు
రిపోర్టర్: మహేష్
స్థలం: Los Angeles
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో జరిగిన ప్రమాదంలో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు మైకెల్ మాన్ స్వల్పంగా గాయపడ్డారని ఆయన ప్రతినిధులు తెలిపారు. గన్ రేంజ్ లో అనుకోకుండా తుపాకీ పేలడంతో ఆయనకు గాయాలయ్యాయని, వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు మరియు లాస్ ఏంజెలెస్ పోలీసులు స్పష్టం చేశారు.