రోడ్డు సౌకర్యం లేక రాకోట గిరిజనుల అవస్థలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చింతపల్లి

చింతపల్లి మండలం కిటుమూల పంచాయతీ రాకోట గ్రామం నుంచి బూచిబందం వరకు రోడ్డు నిర్మాణం లేక గిరిజనులు ఐదు కిలోమీటర్లు కాలినడకనే ప్రయాణిస్తున్నారు. అసంపూర్తిగా మెటల్ వేసిన మార్గం అధ్వానంగా మారడంతో అత్యవసర వేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు విన్నవించినా ఫలితం లేదని, కలెక్టర్కు లేఖ రాసినా స్పందన కరువైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.