ప్రజాస్వామ్య పరిరక్షణకై శ్రమించిన సీతారాం ఏచూరి
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
విద్యార్థి ఉద్యమం నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగి ప్రజాస్వామ్య పరిరక్షణకు సీతారాం ఏచూరి విశేష కృషి చేశారని సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండగుర్ల లింగన్న అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏచూరి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా దేశానికి, పార్టీకి ఆయన చేసిన సేవలను నాయకులు ఘనంగా కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.