ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయవాడ

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని అత్యంత భక్తిప్రపత్తులతో దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేష్, అనిత ఘన స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముర్ముకు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న సాధారణ భక్తులకు ఆమె అభివాదం చేయడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడించారు.