నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సంచలనం: వైకాపాను వీడి జనసేనలో చేరిన బత్తుల మల్లికార్జునరావు
రిపోర్టర్: గోపి
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన వైకాపా సీనియర్ నాయకుడు బత్తుల మల్లికార్జునరావు శుక్రవారం తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో సుదీర్ఘకాలం కలిసి ప్రయాణించిన ఆయన, వైకాపాకు రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కావలి జనసేన పార్టీ సమన్వయకర్త మన్నెమాల సుకుమార్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని సుకుమార్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.