చండీగఢ్లో పెళ్లి వివాదం నేపథ్యంలో తండ్రిని కాల్చి చంపిన కొడుకు

రిపోర్టర్: సురేష్ స్థలం: Chandigarh

చండీగఢ్ సెక్టార్ 22లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కుటుంబ కలహాల నేపథ్యంలో పంతొమ్మిదేళ్ల యువకుడు అర్మాన్ తన తండ్రి నితిన్ను తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు నితిన్ పోలీసు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా, నిందితుడు అర్మాన్ తన పెళ్లికి మరియు వ్యాపారానికి డబ్బులు కావాలని అడిగి గొడవపడినట్లు తెలిపారు. నిందితుడు తన తల్లి మోనికను కూడా హత్య చేయడానికి యత్నించి పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.