ఆసియా క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్ కాంస్యం సాధించిన జయ్ మీనా
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
ఆసియా క్రీడలలో భారతదేశం చరిత్ర సృష్టించింది. పురుషుల సింగిల్స్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో జయ్ మీనా కాంస్య పతకం సాధించి దేశానికి అపూర్వ విజయాన్ని అందించారు. సాఫ్ట్ టెన్నిస్ చరిత్రలో భారత్కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన జయ్ మీనాకు క్రీడా ప్రముఖులు, దేశ ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.