అకాల మృతి చెందిన కొమరమ్మ కుటుంబాన్ని పరామర్శించిన గుజ్జ వీరన్న

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట పట్టణంలోని మూడో వార్డుకు చెందిన బుర్ర కొమరమ్మ అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని కౌన్సిలర్ గుజ్జ వీరన్న శనివారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను నేరుగా కలిసి ఓదార్చి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా ఉంటామని గుజ్జ వీరన్న భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.