మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ఇండియా

రిపోర్టర్: శివ స్థలం: World

మహిళల ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. షఫాలి వర్మ అర్ధశతకంతో రాణించగా, బౌలర్లు సమిష్టిగా రాణించి బంగ్లాను కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 109 పరుగులకే పరిమితమైంది. బౌలర్‌ శ్రీచరణి అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 50 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా రికార్డు సృష్టించింది.