బెంగళూరు వేదికగా ముగిసిన ఒకూటా హాకీ టోర్నమెంట్: విజేతగా స్ట్రైకర్స్

రిపోర్టర్: గోపి స్థలం: బెంగళూరు

బెంగళూరు నగరంలోని శాంతినగర్ లోని కేఎం కరియప్ప హాకీ అరేనాలో జరిగిన ఒకూటా రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ ఘనంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. కోడవ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ పోటీలలో వివిధ జట్లు హోరాహోరీగా తలపడ్డాయని విశ్వనాథ్ బెల్లప్ప పేర్కొన్నారు. జూనియర్ విభాగంలో కోడవ మార్షల్స్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకోగా, సీనియర్ విభాగంలో కాకూట్ స్ట్రైకర్స్ జట్టు అద్భుత విజయం సాధించి ట్రోఫీని ముద్దాడిందని నిర్వాహకులు వెల్లడించారు.