చర్లపల్లి నుంచి శ్రీకాకుళంకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

రాబోయే దసరా, దీపావళి పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మధ్య 16 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించారు. అక్టోబరు 6 నుంచి నవంబరు 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని సీపీఆర్వో ఎ.శ్రీధర్ వెల్లడించారు. నల్గొండ, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే ఈ రైళ్లలో అన్ని రకాల కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి.