ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు: రెండు డీఏల విడుదలకు కేబినెట్ ఆమోదం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు రెండు కరవు భత్యాలను మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సీఎంఓ వెల్లడించింది. చాలా కాలంగా బకాయి ఉన్న డీఏలలో రెండు విడతల మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని పేర్కొంటూ అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నిర్ణయంతో వేలాది మందికి ఆర్థిక లభించనుంది.