నాగావళి నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువతులు దుర్మరణం: మరో ఇద్దరు గల్లంతు
రిపోర్టర్: హరి
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దగనగళ్లవానిపేట సముద్రతీరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాకు చెందిన ప్రైవేటు ఉద్యోగులు విహారయాత్రలో భాగంగా నాగావళి నదిలో సరదాగా ఈతకు దిగి నీటి ఉధృతికి గల్లంతయ్యారు. ఈ ఘటనలో మహి, పావని అనే ఇద్దరు యువతులు మృతి చెందగా, మాధవి, విక్రమ్ అనే మరో ఇద్దరు గల్లంతు కావడం తీవ్ర ఆందోళన కలిగించింది. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.