సిరిసిల్ల గడీలను నేలమట్టం చేస్తానంటూ కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సవాల్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: సిరిసిల్ల
గత పాలకుల గడీలను బద్దలు కొట్టినట్లే సిరిసిల్ల గడీలను కూడా పూర్తిగా నేలమట్టం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేటీఆర్‌ను ఆరుసార్లు గెలిపించినా నేతన్నల ఆత్మహత్యలను, గల్ఫ్ వలసలను ఎందుకు నివారించలేకపోయారని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబ సభ్యులే పదవులు అనుభవించారని, తెలంగాణ కోసం పోరాడిన వారికే తాము సముచిత ప్రాధాన్యం కల్పించామని స్పష్టం చేశారు.