కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

రిపోర్టర్: నరేష్ స్థలం: కుప్పం

కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.10 కోట్ల వ్యయంతో ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.3.30 కోట్ల వ్యయంతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంటును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.