జాతీయ కరాటే పీఠంపై సత్తా చాటిన యువ ప్రజ్ఞాశాలి

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ పుర పరిధిలో జాతీయస్థాయి కరాటే పోటీల్లో నల్ల బెల్టు ఛాంపియన్షిప్ ట్రోఫీ సాధించిన సుక్క మణిచరణ్ను మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్గౌడ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. మణిచరణ్ మరిన్ని విజయాలు సాధించి చౌటుప్పల్కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శిక్షణ ఇస్తున్న మాస్టర్ వై. రాజశేఖర్గౌడ్ను అభినందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చింతల ఉమామహేశ్వరి సాయిలు, పాక చిరంజీవి యాదవ్, బాబా షరీఫ్, ముత్యాల గణేష్కుమార్ తదితరులు పాల్గొని ప్రశంసించారు.