తూర్పుగోదావరి జిల్లాలో ఎర్రకాలువకు గండి: నీట మునిగిన వరి పంటలు

రిపోర్టర్: గోపి స్థలం: తూర్పుగోదావరి

తూర్పుగోదావరి జిల్లా సింగవరం వద్ద ఎర్రకాలువకు గండి పడటంతో వందలాది ఎకరాల్ లో వరి పంటలు నీట మునిగాయని అధికారులు తెలిపారు. కుండపోత వానల కారణంగా కాలువ నీరు పొలాల్లోకి దూసుకురావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిలో నానిన పంటను కాపాడుకునేందుకు ప్లాస్టిక్ తొట్లతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. సింగవరం, తీరుగూడెం, తాళ్లపాలెం గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.