ఐపీఎస్ అధికారి సుశాంత కుమార్ నాథ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Bhubaneswar
ఒడిశాలో డీజీ స్థాయి ఐపీఎస్ అధికారి సుశాంత కుమార్ నాథ్ పై మాజీ మహిళా జైలర్ ఫిర్యాదు మేరకు కటక్ పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఆయనను జైళ్ల శాఖ డీజీ పదవి నుంచి తప్పించి హోమ్ శాఖలో ఓఎస్డీగా నియమించింది. నిష్పాక్షిక విచారణ కోసమే ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.