బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ గైర్హాజరు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి తారిక్ రెహ్మాన్ దూరంగా ఉండనున్నారు. భారత్ నుంచి వ్యక్తిగత ఆహ్వానం అందలేదని, కేవలం బిమ్‌స్టెక్ ఛైర్‌పర్సన్ హోదాలోనే ఆహ్వానించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సార్వభౌమాధికార ప్రతిపత్తిని విస్మరించారనే కారణంతో ప్రధాని ఈ సదస్సుకు హాజరుకావడం లేదని వెల్లడించారు. భారత్-బంగ్లా సంబంధాలలో ఈ పరిణామం చర్చనీయాంశమైంది.