తిమ్మాపురం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస వేడుకలు

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని తిమ్మాపురం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ్ అభియాన్లో భాగంగా పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు, తల్లులు, బాలింతలకు పౌష్టికాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొస్న లక్ష్మికిష్టయ్య యాదవ్, అంగన్వాడీ సూపర్వైజర్ జి వాణిశ్రీ, టీచర్ బట్టు వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.