నిజామాబాద్లో కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర: ఐదో రోజు కొనసాగిన ఉత్సాహం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నిజామాబాద్

కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో సుద్దపల్లి నుండి అర్గుల్ వరకు ఐదో రోజు సైకిల్ యాత్ర ఉత్సాహంగా కొనసాగిందని Arvind Dharmapuri వెల్లడించారు. ఈ యాత్ర వెస్లీ నగర్, మెంట్రాజ్ పల్లి చౌరస్తా, గన్న తండా, బాల్ నగర్, మాధాపూర్ చౌరస్తా, సికింద్రాపూర్, పడకల్ తాండ, పడకల్, మనోహరాబాద్ అలాగే జక్రాన్ పల్లి ప్రాంతాల మీదుగా సాగిందని తెలిపారు. స్థానిక రైతులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని పేర్కొన్నారు.