మక్కాపై డ్రోన్ దాడి ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఇరాన్

రిపోర్టర్: కిరణ్ స్థలం: అంతర్జాతీయం

ఇస్లామిక్ పవిత్ర నగరం మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడికి యత్నించారన్న సౌదీ అరేబియా ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పవిత్ర స్థలాల భద్రతను అడ్డం పెట్టుకుని ముస్లిం దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మక్కా పేరుతో జరుగుతున్న ఆరోపణలను రాజకీయం చేయడం మానుకోవాలని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయెల్ బఘాయీ హితవు పలికారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ నేరాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.