ఉట్నూరులో ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతిని ఉట్నూరు పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాలతో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో అనేక సంస్కరణలు చేపట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.