'రేవంతుడి పీచమణచడం ఖాయం': కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ శ్రేణుల నిప్పులు
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
లాఠీచార్జీలు, నిర్బంధాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయలేరని బీఆర్ఎస్ తీవ్రంగా హెచ్చరించింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, పోలీసులు అడ్డుకున్నా రేవంత్ రెడ్డి అధికారమదాన్ని కూల్చడం ఖాయమని, తమ పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తేల్చిచెప్పింది.