మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం: గంటల వ్యవధిలో తల్లి, కుమారుడు ఆత్మహత్య
రిపోర్టర్: రమేష్
స్థలం: మెదక్
మెదక్ జిల్లా మక్త లక్ష్మాపూర్‌కు చెందిన బేతమ్మ కుటుంబ గొడవల కారణంగా హైదరాబాద్‌లోని దుండిగల్‌లో ఆత్మహత్య చేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆమె కుమారుడు ప్రవీణ్ కూడా కోలపల్లి గ్రామ శివారులో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొద్ది గంటల వ్యవధిలోనే తల్లి, కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.