హైదరాబాద్‌లో సెప్టెంబర్ 20న బీసీ కవుల రజతోత్సవ సభ

రిపోర్టర్: కిరణ్ స్థలం: నల్లగొండ

జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన 'వెంటాడే కలాలు వెనుకబడిన కులాలు' కవితా సంకలనం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 20న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజితోత్సవ సభ జరగనుంది. ఈ మేరకు నల్లగొండలో నిర్వహించిన సభలో కవులు మాట్లాడుతూ, చట్టసభల్లో రిజర్వేషన్లు లేనంత కాలం బీసీల స్థితిగతుల్లో మార్పు రాదని, హక్కుల సాధనకు ఐక్యంగా దండెత్తాలని పిలుపునిచ్చారు.