విజయవాడ ఆన్ లైన్ రాడికలైజేషన్ కేసులో తొమ్మిది మందిపై ఎన్ఐఏ ఛార్జిషీటు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయవాడ
విజయవాడ ఆన్లైన్ రాడికలైజేషన్ కేసులో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసి తొమ్మిది మంది నిందితులపై విజయవాడ ప్రత్యేక కోర్టులో గురువారం ఛార్జిషీటు దాఖలు చేశారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై విజయవాడ కేంద్రంగా విధ్వంసానికి కుట్ర పన్నిన ఈ ముఠాపై నిఘా పెట్టిన అధికారులు, ఇప్పటివరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పేలుడు పదార్థాల తయారీకి ప్లాన్ చేయడంతో పాటు సొంతంగా కమ్యూనికేషన్ యాప్ను కూడా ఈ ముఠా అభివృద్ధి చేసింది.