ఉపాధ్యాయుల బాధ్యతను చాటిన ఎస్టీయూ వైభవోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నకిరేకల్

నకిరేకల్లో ఎస్టీయూ 80 వసంతాల వైభవోత్సవాల పోస్టర్ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సమాజ మనుగడకు తోడ్పడాలని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని కోరారు. ప్రజా ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు ఇండ్ల శ్రీనివాస్, కల్లూరి రమేష్, బకనగారి జంగయ్య, బొమ్మగాని నాగభూషణం, నరసింహ, వెంకటేశ్వర్లు, ఉయ్యాల బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.