కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియా టుడే సదస్సులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవడంతో ప్రజల్లో ఆర్ఆర్ఆర్ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్కు ఓటేసిన ప్రజలు తమ నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నారని, ఆ పశ్చాత్తాపం ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు దిశగా మారుతోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.