ఫోన్ ట్యాపింగ్ కేసు: కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డిని విచారించిన సిట్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డిని సిట్ అధికారులు విచారించినట్లు సమాచారం. ఆయన కార్యాలయానికి నేరుగా వెళ్లిన సిట్ బృందం, దాదాపు నలభై నిమిషాలకు పైగా పలు కీలక అంశాలపై ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డు చేసింది. రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించడంతో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.