పంజాబ్‌ ప్రభుత్వ తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని ఆప్ ప్రభుత్వం అణచివేస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. డ్రగ్స్ మాఫియాను ప్రశ్నించినందుకు మంత్రి వేధింపులతో గుల్జార్ సింగ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. వెంటనే మంత్రి హర్‌పాల్ సింగ్ చీమా రాజీనామా చేయాలని, నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.