అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ భవితవ్యంపై ట్రంప్ సందిగ్ధత

రిపోర్టర్: సురేష్ స్థలం: Washington

మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీ ఓటమి నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పదవిపై ఉత్కంఠ నెలకొన్నట్లు సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. ఇరాన్ యుద్ధ ప్రభావంపై అమెరికా అధ్యక్ష భవనంలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయని, అయితే హెగ్సెత్ పనితీరుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై అడ్వైజర్లు, అధికారులతో విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం.