'కాలేజ్ ఫెస్ట్' సినిమాలో అలిజె అగ్నిహోత్రి: సల్మాన్ ఖాన్ మేనకోడలు కొత్త చిత్రం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ముంబై
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మేనకోడలు అలిజె అగ్నిహోత్రి తన రెండో చిత్రంగా 'కాలేజ్ ఫెస్ట్'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) సంస్థ నిర్మిస్తున్న ఈ జోంబీ కామెడీ డ్రామా చిత్రానికి వైభవ్ బుంధూ దర్శకత్వం వహిస్తుండగా, అరుణాభ్ కుమార్ కథ అందించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, కాలేజీ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ చిత్రంలో ఆశిష్ చంచ్లాని కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.