నెత్తురోడిన జాతీయ రహదారిపై రక్తపు ముద్దలైన నిండుజీవితాలు

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూర్మన్నపాలెం డిపో వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో వారు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుల వివరాలు సేకరిస్తూ, ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.