కుక్కునూరులో ఆక్రమణల దెబ్బ.. రోడ్లపైనే వర్షపు నీరు!
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
కుక్కునూరు మండల కేంద్రంలో రహదారికి ఇరువైపులా ఉన్న సైడ్ డ్రెయిన్లు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో వర్షపు నీరు వెళ్లేందుకు మార్గం లేక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షం కురిసిన ప్రతిసారీ నీరు రహదారిపైనే నిలిచిపోతుండటంతో బాటసారులు, ద్విచక్ర వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఆక్రమణలను తొలగించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.