అన్న క్యాంటీన్ల దూర భారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విస్మయం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అరకులోయ

అన్న క్యాంటీన్లకు వంద కిలోమీటర్లకు పైగా దూరంలో నుంచి భోజనం సరఫరా చేస్తుండటంపై అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విస్మయం వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరవై అన్న క్యాంటీన్లకు కిచెన్లు దూరంగా ఉండటంతో అరకు, పాడేరు ప్రాంతాల్లో ఉదయం టిఫిన్, రాత్రి భోజనం అందక కేవలం మధ్యాహ్న భోజనానికే పరిమితం కావడంపై ఆయన ఆరా తీశారు. సకాలంలో ఆహారం అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.