తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న తిరుపతి

రిపోర్టర్: వెంకట్ స్థలం: తిరుపతి

ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తిరుపతి నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తులకు ఆధ్యాత్మిక భావన కలిగించేలా ప్రధాన కూడళ్లలో ప్రత్యేక విద్యుద్దీపాలు, ఆకర్షణీయమైన అలంకరణలు ఏర్పాటు చేస్తున్నారు. గరుడ, కపిలతీర్థం, ఎన్టీఆర్ కూడళ్లు, ఇస్కాన్ మరియు ఎయిర్‌పోర్టు మార్గాలను సుందరీకరిస్తున్నారు.